యుంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య ఫుల్ మాస్ లుక్ లో కనిపించిన సినిమా ‘ఆటోనగర్ సూర్య’. ‘ఆటోనగర్ సూర్య’ సినిమా జూన్ 27న విడుదలై అటు ప్రేక్షకుల నుండి, ఇటు విమర్శకుల నుండి మిక్స్డ్ టాక్ ని తెచ్చుకుంది. ఈ మూవీలో నాగ చైతన్య పెర్ఫార్మన్స్ కి మంచి మార్కులు పడ్డాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని జెమిని టీవీ వారు ఓ ఫ్యాన్సీ రేటుకి సొంతం చేసుకున్నారు. దేవకట్టా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది.
ఈ మధ్య జెమిని టీవీ వారు వరుసగా సూపర్ హిట్ సినిమాలను మరియు విడుదలకు రెడీ అవుతున్న క్రీజీ ప్రాజెక్ట్స్ శాటిలైట్ రైట్స్ ని దక్కించుకుంటున్నారు. విడుదలై మంచి సక్సెస్ అందుకున్న ‘మనం’, ‘దృశ్యం’ లాంటి సినిమాలతో పాటు విడుదలకు రెడీ అవుతున్న ‘కార్తికేయ’, ‘ఆగడు’ సినిమాల శాటిలైట్ రైట్స్ ని కూడా జెమిని వారు సొంతం చేసుకున్నారు.


