పవన్ కళ్యాణ్ నటించిన ‘గోపాల గోపాల’ సినిమా షూటింగ్ కాశీలో శరవేగంగా సాగుతుంది. అయితే ఈ సినిమా శాటిలైట్ హక్కులను భారీ ధరకు జెమినీ టి.వి సొంతం చేసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు
బాలీవుడ్ లో ఘన విజయం సాధించిన ‘ఓ మై గాడ్’ కి ఈ సినిమా రీమేక్. వెంకటేష్ ఒక మధ్యతరగతి నాస్తికుడి పాత్ర పోషిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ శ్రీ కృష్ణుడిగా కనిపించనున్నాడు. కిషోర్ పార్థసాని దర్శకుడు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు


