బొమ్మరిల్లు బేబీది ఎంత పెద్ద మనసు…!

Published on Aug 13, 2019 1:33 pm IST

జెనీలియా అంటే టక్కున గుర్తొచ్చే చిత్రం బొమ్మరిల్లు. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ కల్మషం తెలియని హాసిని అనే అమ్మాయి పాత్రలో ఆమె నటన తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండి పోతుంది. తెలుగులో సై, సాంబ, నా అల్లుడు,హ్యాపీ,ఢీ, రెడీ వంటి చిత్రాలలో నటించారు. 2010లో రాంచరణ్ హీరోగా వచ్చిన ఆరెంజ్ చిత్రం తరువాత తెలుగులో నటించలేదు. 2012లో నటుడు రితేష్ దేశముఖ్ ని పిళ్లి చేసుకున్నారు. జెనీలియాకు రియాన్,రహీల్ అనే ఇద్దరు కొడుకులు.

ఇటీవల మహారాష్ట్ర లో వరదలు సంభవించిన సంగతి తెలిసిందే. కాగా ఈ వరదల వలన నిరాశ్రయములైన బాధితుల సహాయార్ధం జెనీలియా దంపతులు 25లక్షల విరాళాన్ని ప్రకటించారు. సదరు చెక్ ని స్వయంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ని కలిసి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆ దంపతులకు ట్విట్టర్ వేదికగా కృతఙ్ఞతలు తెలపడం జరిగింది.

సంబంధిత సమాచారం :