పండంటి మగబిడ్డను ప్రసవించిన జెనిలియా

పండంటి మగబిడ్డను ప్రసవించిన జెనిలియా

Published on Nov 25, 2014 9:00 PM IST

genelia
టాలీవుడ్ లో మరపురాని విజయాలను అందుకున్న ముద్దుగుమ్మ జెనిలియా. బొమ్మరిల్లు, రెడీ, డీ వంటి సినిమాలు ఈమె ఖాతాలో నిలిచినా బ్లాక్ బస్టర్ లు. ఆ తరువాత 2012లో రితేష్ దేశ్ ముఖ్ ని పెళ్ళాడి ముంబాయిలో స్థిరపడిపోయింది

తాజా సమాచారం ప్రకారం దేశ్ ముఖ్ వారి వంశానికి ఒక శుభవార్త లభించింది. కొద్దిసేపటి క్రితమే జెనిలియా ముంబాయిలో పండంటి మగబిడ్డను ప్రసవించి నట్టు సమాచారం. తల్లీ బిడ్డా ఇద్దరూ క్షేమమేనని డాక్టర్లు తెలిపారు. జెనిలియాకు వారి కుటుంబ సభ్యులకు 123తెలుగు ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

తాజా వార్తలు