కుమారుడికి పేరు పెట్టిన జెనీలియా

కుమారుడికి పేరు పెట్టిన జెనీలియా

Published on Dec 7, 2014 10:00 AM IST

genelia
‘బాయ్స్’ సినిమాతో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయమై ఆ తర్వాత టాలీవుడ్ లో డీ, రెడీ, బొమ్మరిల్లు లాంటి మరపురాని సినిమాలతో విజయాలను అందుకున్న ముద్దుగుమ్మ జెనీలియా. 2012లో బాలీవుడ్ స్టార్ హీరో అయిన రితేష్ దేశ్ ముఖ్ ని పెళ్ళాడి ముంబాయిలో స్థిరపడిపోయింది. ఈ భామ ఇటీవలే పండంటి మగబిద్దకి జన్మనిచ్చింది. వాళ్ళ నాన్నే మళ్ళీ తన ఇంట్లో పుట్టాడని రితేష్ దేశ్ ముఖ్ చాలా హ్యాపీ ఫీలయ్యాడు.

జెనీలియా – రితేష్ కలిసి తన కుమారుడికి నామకరణం చేసారు. జెనీలియా తన కుమారుడికి పెట్టిన పేరు రియాన్ రితేష్ దేశ్ ముఖ్ అని ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. పెళ్ళైన తర్వాత సిల్వర్ స్క్రీన్ కి దూరమైన జెనీలియా రితేష్ దేశ్ ముఖ్ ప్రొడక్షన్ హౌస్ ని చూసుకునేది. కానీ ఇప్పుడు వారసుడు పుట్టడంతో కొద్ది రోజులు అన్నిటికీ దూరంగా ఉండి కుమారుడి జాగ్రత్తలు తీసుకునే పనిలో ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు