ఇంట్రెస్టింగ్ గా ‘జెంటిల్ మేన్ – 2’ మోషన్ పోస్టర్

ఇంట్రెస్టింగ్ గా ‘జెంటిల్ మేన్ – 2’ మోషన్ పోస్టర్

Published on Aug 10, 2023 2:05 AM IST

gen
కొన్నేళ్ల క్రితం శంకర్ దర్శకత్వంలో అర్జున్ సర్జా హీరోగా మధుబాల హీరోయిన్ గా తెరకెక్కిన యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ జెంటిల్ మేన్. ఈ మూవీ తమిళ్ తో పాటు అప్పట్లో తెలుగులో కూడా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ కొట్టింది. అయితే ఈ సినిమాని నిర్మించిన ప్రముఖ నిర్మాత కెటి కుంజుమోన్ దీనికి సీక్వెల్ గా జెంటిల్ మేన్ 2 ని మరింత గ్రాండ్ గా జెంటిల్ మేన్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ పై నిర్మించనున్నట్లు ఇటీవల ప్రకటించారు.

అలానే దీనికి ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందించనుండగా ఏ గోకుల్ కృష్ణ దర్శకత్వం వహించనున్నారు. కాగా మ్యాటర్ ఏమిటంటే, నేడు ఈమూవీ యొక్క టైటిల్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసారు మేకర్స్. కాన్ఫిడెన్స్ ఈజ్ అవర్ ట్రేడ్ మార్క్ అనే క్యాప్షన్ తో తెరకెక్కిన జెంటిల్ మేన్ 2 మోషన్ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో తో పాటు అందరినీ ఆకట్టుకుని సినిమా పై మంచి అంచనాలు ఏర్పరిచింది. కాగా ఈ మూవీ గురించిన మరిన్ని వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడి కానున్నాయి

తాజా వార్తలు