రేపటి నుంచి స్టార్ట్ కానున్న ‘జార్జ్ క్రిష్’ !

రేపటి నుంచి స్టార్ట్ కానున్న ‘జార్జ్ క్రిష్’ !

Published on Aug 26, 2026 5:05 PM IST

George-Krish

దర్శకుడు శ్రీను వైట్ల – హీరో శర్వానంద్ కాంబినేషన్ లో రాబోతున్న ‘జార్జ్ క్రిష్’ సినిమా పై కొత్త అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ రేపటి నుంచి స్టార్ట్ కానుంది. శ్రీను వైట్ల లాంగ్ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ మొత్తం హైదరాబాద్ లోనే జరగనుంది. అన్నట్టు ఈ షెడ్యూల్ లో ఈ సినిమా ఓపెనింగ్ సన్నివేశాలను చిత్రీకరిస్తారని, అనంతరం శర్వానంద్ పై ఓ సాంగ్ ను కూడా షూట్ చేస్తారని తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

కాగా గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ ‘విశ్వం’ ఏవరేజ్ గా నిలిచింది. దీంతో, ఎలాగైనా మళ్ళీ టాలీవుడ్ లో తన తర్వాత సినిమాతో బిజీ అయ్యేందుకు శ్రీనువైట్ల తెగ కష్ట పడుతున్నాడట. ఈ క్రమంలోనే శర్వాతో సినిమా చేస్తున్నాడు. కాగా తెలియని వయసులో ఆవేశంలో చేసిన ఓ పని కారణంగా హీరో లైఫ్ లో జరిగే డ్రామా చాలా బాగుంటుందట. ఐతే, గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ ‘విశ్వం’ ఏవరేజ్ గా నిలిచింది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు