దర్శకుడు శ్రీను వైట్ల – హీరో శర్వానంద్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ‘జార్జ్ క్రిష్’. ఈ సినిమాను సంక్రాంతి బరిలో దించాలని శరవేగంగా షూట్ చేస్తున్నారు. అందుకే, షెడ్యూల్స్ మధ్య ఎక్కువ గ్యాప్ లేకుండా వరుసగా షూట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు నుంచి చివరి షెడ్యూల్ జరగనుంది. ఈ షెడ్యూల్ తో సినిమా పూర్తి కానుంది. మరోవైపు ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ కానుంది. ఇక, శర్వానంద్ ఈ సినిమాలో జూనియర్ సైంటిస్ట్ గా కనిపించబోతున్నాడు.
శర్వా పాత్ర చుట్టూ సాగే డ్రామా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని.. సినిమాలో చాలా ఎపిసోడ్స్ ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంటాయని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా మానస వారణాసి నటిస్తుంది. శర్వానంద్ – హీరోయిన్ మానస వారణాసి లవ్ స్టోరీ చాలా ట్రెండీగా ఉంటుందని.. చాలా ఫన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సాగుతుందని తెలుస్తోంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని అనీల్ సుంకర నిర్మాణం వహిస్తుండగా వచ్చే ఏడాది జనవరి 14న విడుదల చేయబోతున్నారు.


