గెట్ రెడీ..”కేజీయఫ్ 2″ మ్యూజిక్ ఫీస్ట్ వచ్చేస్తుంది.!

Published on Jul 1, 2021 4:31 pm IST

ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో “కేజీయఫ్ చాప్టర్ 1” కూడా ఒకటి. విడుదలైన అన్ని భాషల్లో కూడా భారీ హిట్ టాక్ తెచ్చుకొని వసూళ్లు రాబట్టింది. అందుకే ఈ సినిమా సీక్వెల్ అయినటువంటి చాప్టర్ 2 పై ఎనలేని అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రంపై ఇంత క్రేజ్ రావడానికి రాకింగ్ స్టార్ యష్ తో పాటు దర్శకుడు ప్రశాంత్ నీల్ టేకింగ్ ఎంత పాత్ర పోషించిందో వాటిని మరింత ఎలివేట్ చేస్తూ సంగీత దర్శకుడు రవి బాసృర్ ఇచ్చిన మ్యూజిక్ కూడా కీలక పాత్ర పోషించింది. ఒక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనే కాకుండా పాటలు కూడా మంచి చార్ట్ బస్టర్స్ అయ్యాయి.

దీనితో చాప్టర్ 2 ఆల్బమ్ పై కూడా ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. కానీ వాటిపై ఇంకా ఎలాంటి బజ్ లేదు.. అయితే ఇపుడు దానిపై అప్డేట్ వచ్చేసింది.. ఈ చిత్రం తాలూకా మ్యూజిక్ రైట్స్ గత భాగం హక్కులు దక్కించుకున్న లహరి మ్యూజిక్ అండ్ టి సిరీస్ వారే కొనుగోలు చేశారట.. మరి అలాగే లిరికల్ సాంగ్స్ లాంచ్ బహుశా ఆగష్టు నెల నుంచి ఉండనున్నాయట. మరి ఈసారి ఆల్బమ్ ఏ లెవెల్లో ఉంటుందో చూడాలి. ఇప్పటికే టీజర్ లో ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కే మూవీ లవర్స్ ఓ రేంజ్ లో అంచనాలు పెట్టేసుకున్నారు. మరి వారందరూ రెడీ అవ్వాల్సిందే..

సంబంధిత సమాచారం :