గెట్ రెడీ..నితిన్ కోసం యంగ్ టైగర్ ఎంట్రీ.!

Published on Mar 17, 2021 1:00 pm IST

తన గత చిత్రం “భీష్మ”తో సాలిడ్ కం బ్యాక్ ఇచ్చిన యూత్ స్టార్ నితిన్ ఈ ఏడాది మోస్ట్ టాలెంట్ దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి తో వచ్చిన “చెక్” తో మళ్ళీ పరాజయాన్ని అందుకున్నాడు. అయితే ఆ చిత్రంకు సరైన టైమింగ్ లేకపోవడం వల్ల ఆ ప్రయోగం మిస్ ఫైర్ అయ్యింది. మరి దీని తర్వాత లైన్ లో యువ దర్శకుడు వెంకీ అట్లూరి తో ప్లాన్ చేసిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం “రంగ్ దే”.

దీనిపై మాత్రం మంచి హైప్ ఇప్పటికే ఏర్పడింది. అయితే ఇప్పుడు లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ చిత్రానికి సంబంధించి ఓ టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రం తాలూకా ప్రీ రిలీజ్ కు గాను యంగ్ టైగర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా రానుండటం కన్ఫర్మ్ అన్నట్టు తెలుస్తుంది. ఆల్ మోస్ట్ తారక్ వస్తున్నాడనే ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

మరి దీనిపై ఒక అధికారిక క్లారిటీ వస్తే ఫ్యాన్స్ మంచి ట్రీట్ ఖాయం అని చెప్పాలి. మరి ఈ చిత్రంలో నితిన్ సరసన కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఈ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :