
అచ్చ తెలుగమ్మాయి అంజలి ప్రధాన పాత్రలో, కమెడియన్ శ్రీనివాస రెడ్డి హీరోగా చేసిన సినిమా ‘గీతాంజలి’. ఈ సినిమా ఆడియో నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ ఆడియో కార్యక్రమానికి హీరో గోపీచంద్, వివి వినాయక్, లక్ష్మీ మంచు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అంజలి మాట్లాడుతూ ‘నేను చేసిన అన్ని సినిమాల్లోనూ ఇది ప్రత్యేకమైనది. నా కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయే సినిమా. డైరెక్షన్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ అవుతుందని’ తెలిపింది.
‘భారీ బడ్జెట్ వల్ల సినిమాలు ఆడవు, కొత్త ఐడియాలతో కథలు తాస్తేనే సినిమా హిట్ అవుతుంది. ఈ కథ విన్నప్పుడు నేను ఇప్పటివరకూ 45 కథలు రాసాను నాకెందుకు ఇలాంటి ఐడియా రాలేదని అనుకున్నాను. బ్రహ్మానందం గారి పాత్ర కీలకం అవుతుందని’ కోనా వెంకట్ అన్నాడు. హర్షవర్ధన్ రాణే, బ్రహ్మానందం, రావు రమేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ కామెడీ హర్రర్ సినిమా ద్వారా రాజ కిరణ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.