చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటిస్తున్న ది మోస్ట్ ప్రెస్టీజియస్ చిత్రం ‘బైకర్’పై ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాను దర్శకుడు అభిలాష్ రెడ్డి కంకర డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా టాలీవుడ్‌లో తొలి బైక్ రేసింగ్ చిత్రంగా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది. కాగా, ఈ సినిమాలో యాంగ్రీ స్టార్ రాజశేఖర్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన పాత్రకు సంబంధించిన గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ సినిమాలో బుల్లెట్ సునీల్ అనే పాత్రలో రాజశేఖర్ నటిస్తున్నారు. ఒకప్పుడు మోటోక్రాస్ రేసర్‌గా ఉన్న బుల్లెట్ సునీల్ బైక్ రేసింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఇండియాను విజేతగా నిలిపేందుకు ఎలాంటి పాట్లు పడతాడు అనేది ఈ సినిమాలో రాజశేఖర్ పాత్రగా ఉండబోతుంది. ఈ పాత్రలో రాజశేఖర్ తన పర్ఫార్మెన్స్‌తో మరోసారి ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇక బైక్ రేసింగ్ కోసం శర్వాకు రాజశేఖర్ ఎలాంటి ట్రైనింగ్ ఇస్తాడు అనేది మనకు ఈ సినిమాలో చూపెట్టబోతున్నారు. ఈ సినిమాలో శర్వా స్లిమ్ లుక్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేయబోతున్నాడు. ఈ సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తోండగా గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ బైకర్ చిత్రాన్ని ఏప్రిల్ 3న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


