తన ఆల్ టైం ఫేవరెట్ సినిమాల లిస్ట్ చెప్పిన గ్లోబల్ స్టార్ చరణ్.!

Published on Mar 2, 2023 9:00 am IST

టాలీవుడ్ ప్రైడ్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” తో హీరో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. ప్రస్తుతం అంతర్జాతీయ మీడియాలో అదరగొడ్తున్న చరణ్ నెక్స్ట్ అయితే ఆస్కార్ ఈవెంట్ కోసం సిద్ధం అవుతున్నాడు. మరి కొన్ని రోజుల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా వెళ్లనుండగా ఈ గ్యాప్ లో అయితే చరణ్ అక్కడి మీడియా వారితో ముచ్చటిస్తున్నాడు. మరి ఈ మీడియాలో అయితే చరణ్ తన ఆల్ టైం ఫెవరెట్ సినిమాల లిస్ట్ ని తెలియజేసాడు.

హాలీవుడ్ నుంచి అయితే గ్లాడియేటర్, ది నోట్ ఇన్ గ్లోరియస్ బాస్టర్డ్స్ అలాగే జేమ్స్ కెమరూన్ టెర్మినేటర్ 2 సినిమాలు బాగా ఇష్టం అని వాటిలో టెర్మినేటర్ 2 చాలా ఎక్కువ సార్లు చూశానని తెలిపాడు. ఇక ఇండియన్ సినిమా లో అయితే దాన వీర శూర కర్ణ, తన రంగస్థలం, మిస్టర్ ఇండియా, రాజమౌళి బాహుబలి సినిమాలు బాగా ఇష్టం అని అయితే చరణ్ తన ఆల్ టైం ఫెవరెట్ సినిమాల లిస్ట్ ని ఇంటర్నేషనల్ మీడియాలో తెలిపాడు. దీనితో ఈ కామెంట్స్ మంచి వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం :