ఫస్ట్ టైం డీసెంట్ టీఆర్పీ రాబట్టిన “గాడ్ ఫాదర్”.!

Published on Jan 27, 2023 6:00 pm IST

మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా నటించిన సాలిడ్ మల్టీ స్టారర్ చిత్రం “గాడ్ ఫాదర్”. మరి దర్శకుడు మోహన రాజా తెరకెక్కించిన ఈ చిత్రం దసరా కానుకగా రిలీజ్ అయ్యి మంచి వసూళ్లే అందుకుంది. ఇక ఈ చిత్రం అయితే రీసెంట్ గానే జెమినీ టీవీ లో సంక్రాంతి పండుగ కానుకగా అయితే మొదటిసారి టెలికాస్ట్ కి వచ్చింది.

దీనితో ఈ చిత్రం మొదటి టెలికాస్ట్ లో డీసెంట్ రేటింగ్ ని అందుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ చిత్రానికి 7.69 రేటింగ్ పాయింట్స్ వచ్చాయట. దీనితో గాడ్ ఫాదర్ పర్వాలేదనిపించే రేటింగ్ అందుకుంది చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్స్ మరియు సూపర్ గుడ్ ఫిల్మ్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :