మెగాస్టార్ “గాడ్ ఫాదర్ మాస్ సాంగ్ షూటింగ్ పూర్తి!

Published on Jul 31, 2022 10:16 pm IST


మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ తో భారీ హిట్ కొట్టాలని చూస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. కొన్ని రోజుల క్రితం చిరంజీవి ఇంటర్నెట్‌ను షేక్ చేసిన సాంగ్ షూట్ నుండి ఫోటో ను పంచుకున్నారు. చిరంజీవి, సల్మాన్‌ ఖాన్‌లు నటిస్తున్న ఈ మాస్‌ సాంగ్‌ షూటింగ్‌ పూర్తయిందని తాజా సమాచారం.

ఈ పాటకు డ్యాన్స్ డైనమైట్, ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా కొరియోగ్రఫీ అందించారు. ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి మరియు సల్మాన్ ఖాన్ ఇద్దరి స్టెప్పులను చూసి థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయం అని చెప్పాలి. నయనతార, సత్యదేవ్, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, సూపర్‌ గుడ్‌ ఫిల్మ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హనుమాన్ జంక్షన్ ఫేమ్ మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :