హోటల్ రంగంలో అడుగు పెట్టనున్న స్టార్ రచయిత

Kona-Venkat3
స్టార్ రచయిత కోన వెంకట్ టాలీవుడ్ లో గత పదేళ్ళుగా వచ్చిన ఎన్నో హిట్ చిత్రాలతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. గోపి చంద్ తో కలసి సరదా సంభాషణలతో పర్ఫెక్ట్ టైమింగ్ తో వుండే పంచులతో ఎంతో పేరు సంపాదించుకున్నాడు. ఈ స్టార్ రచయిత ఇప్పుడు హోటల్ రంగంలో అడుగుపెడుతున్నాడు. ‘కోన కూచిపూడి – తెలుగు రుచులు’ పేరుతో ఒక రెస్టారెంట్ ప్రారంభించనున్నాడు.

ఈ ఫ్రాంచైజ్ లో మొదటి హోటల్ ని బాపట్ల లో ప్రారంభిస్తారు. హైదరాబాద్ మరియు తెలంగాణా లోని కొన్ని ప్రాంతాలలో కూడా ప్రారంభిస్తారని సమాచారం. హోటల్ రంగంలోకి మూవీ ఆర్టిస్ట్లు అడుగు పెట్టడం ఇది మొదటి సారి కాదు. నాగార్జున కు హైదరాబాద్ లో చైన్ అఫ్ రెస్టారెంట్స్ తో పాటు ఫైన్ డైన్ ప్లేస్ లు కూడా వున్నాయి.

Exit mobile version