భరత్ కు గోల్డెన్ ఛాన్స్

భరత్ కు గోల్డెన్ ఛాన్స్

Published on Jun 11, 2018 11:27 AM IST

‘పోకిరి, దుబాయ్ శీను, ఢీ, రెడీ’ వంటి సినిమాల్లో బాల నటుడిగా నటించి అందరి మెప్పూ పొందిన మాస్టర్ భరత్ ప్రస్తుతం నటుడిగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ మధ్య అతను నటించిన ‘అల్లుడు శీను, ఈడు గోల్డ్ ఎహే, దూసుకెళ్తా’ లాంటి సినిమాలు పెద్దగా సక్సెస్ ఇవ్వలేకపోయాయి. దీంతో సరైన రోల్స్ కోసం ఎదురుచూస్తున్న ఆయనకు ఏబిసిడి తెలుగు రీమేక్ రూపంలో గోల్డెన్ ఛాన్స్ దొరికింది.

అల్లు శిరీష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో భరత్ శిరీష్ యొక్క స్నేహితుడి పాత్రలో కనిపించనున్నాడు. కథలో ప్రాముఖ్యత కలిగిన ఈ పాత్రకు సినిమాలో ఎక్కువ నిడివే ఉంటుందట. మరి ఈ అవకాశాన్ని భరత్ ఎలా సద్వినియోగం చేసుకుంటారో చూడాలి. మధుర శ్రీధర్, యాష్ రంగినేనిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు నూతన దర్శకుడు సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించనుండగా కన్నడ కంపోజర్ జుడా శాండీ సంగీతాన్ని అందివ్వనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు