సెన్సార్ రిపోర్ట్స్ బాగున్నాయ్.. మరి ప్రేక్షకుల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి !

సెన్సార్ రిపోర్ట్స్ బాగున్నాయ్.. మరి ప్రేక్షకుల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి !

Published on Jun 6, 2018 11:06 AM IST

సూపర్ స్టార్ రజనీకాంత్ సాలిడ్ హిట్ అందుకుని చల్ కాలమైంది. 2010లో వచ్చిన ‘రోబో’ తరవాత ‘కొచ్చాడయాన్, లింగ, కబాలి’ వంటి సినిమాలో పెద్దగా బాక్సాఫీస్ ముందు సత్తా చాటకపోవడంతో ఆయన కొత్త చిత్రం ‘కాలా’పైనే ఫ్యాన్స్ హోప్స్ పెట్టుకున్నారు. పొలిటికల్ ఎంట్రీ తరవాత వస్తున్న మొదటి సినిమా కావడంతో అభిమానులు ఈ చిత్రాన్ని కొంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు.

సెన్సార్ రిపోర్ట్స్ మేరకు సినిమా చాలా రేసీగా, మంచి యాక్షన్ సన్నివేశాలతో, పంచ్ డైలాగులతో నిండి ఉంటుందని తెలుస్తుండగా రేపు థియేటర్లలోకి అడుగుపెట్టబోతున్న ఈ చిత్రం అభిమానుల్ని, ప్రేక్షకుల్ని ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. ‘కబాలి’ ఫేమ్ పా.రంజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ధనుష్ స్వయంగా నిర్మించారు. ఓవర్సీస్లో ఈ చిత్రం రికార్డ్ స్ధాయిలో 322 లొకేషన్లో విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు