మంచి వసూళ్లతో దూసుకు వస్తున్న శ్యామ్ సింగరాయ్!

Published on Dec 26, 2021 11:35 pm IST

న్యాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం లో తెరకెక్కిన శ్యామ్ సింగరాయ్ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి విజయవంతం గా ప్రదర్శితమవుతుంది. కృతి శెట్టి, సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్ లు లేడీ లీడ్ రోల్స్ లో నటించిన ఈ చిత్రం మొదటి రెండు రోజుల కంటే మూడవ రోజు హౌజ్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకు పోతుంది.

మొదటి షో నుండి దాదాపు అన్ని ప్రాంతాల్లో హౌజ్ ఫుల్ గా ప్రదర్శింప బడుతోంది. ఈ సినిమా ను ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఆదరిస్తున్నారు. నాని నటనకు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఈ సినిమా లో రాహుల్ రవీంద్రన్, మురళి శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం :