
బీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో అల్లరి నరేష్ మరియు సునీల్ కలిసి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సిల్లీ ఫెలోస్’. కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి నిర్మాణంలో కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 7న విడుదలైయింది. సినిమాలో కామెడీ బాగానే వర్కౌట్ అవ్వడంతో బి.సి సెంటర్స్ లో మరియు సింగిల్ స్క్రీన్స్ లో ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్ ని రాబట్టుకోగలిగింది.
కాగా, సినిమాలో అల్లరి నరేష్ తన కామెడీ టైమింగ్ తో మంచి కామెడీని పండించడం కారణంగా సినిమా ఎంటర్ టైన్ గా సాగుతుంది. దీనికి తోడు సునీల్ కామెడీ తోడవ్వడంతో ‘సిల్లీ ఫెలోస్’ బి.సి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. హీరోలతో పాటు జేపీ కామెడీ కూడా బాగా పండిందని, ఆయన తన కామెడీ టైమింగ్ తో బాగా నవ్వించారని సినిమా చూసిన ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు. కాగా అల్లరి నరేష్ సరసన హీరోయిన్ గా చిత్రశుక్ల నటించగా సునీల్ కి జోడిగా పూర్ణ నటించింది.