మంచి ధరకు అమ్ముడైన నాగ శౌర్య సినిమా హక్కులు !

ఇటీవలే ‘ఛలో’ చిత్రంతో మంచి హిట్ అందుకున్న నటుడు నాగ షూర్య చేసిన చిత్రం ‘అమ్మమ్మగారిల్లు’. సుందర్ సూర్య డైరెక్ట్ చేసిన ఈ చిత్రం అన్ని పనులు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. విడుదలైన ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ మంచి స్పందన రాగా శాటిలైట్ హక్కులు కూడ మంచి ధరకు అమ్ముడయ్యాయి.

ప్రముఖ టీవీ ఛానెల్ జెమిని ఈ చిత్ర హక్కుల్ని రూ.2.75 కోట్లకు కొనుగోలు చేసింది. కుటుంబ కథా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో నాగ శౌర్యకు జంటగా షామిలి నటిస్తోంది. స్వాజిత్ మూవీస్ బ్యానర్ పై కె.ఆర్ మరియు రాజేష్ లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకుతీసుకురానున్నారు.

Exit mobile version