Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
‘కాలా’ తెలుగు థియేట్రికల్ రైట్స్ ఎంతో తెలుసా !
Published on Jun 6, 2018 1:36 pm IST


ఈ వారం విడుదలకానున్న ఏకైక పెద్ద సినిమా ‘కాలా’. రజనీకాంత్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమాను పా.రంజిత్ డైరెక్ట్ చేశారు. భారీ అంచనాల నడుమ రేపు విడుదలకానున్న ఈ చిత్ర హక్కులు తమిళనాట అన్ని ఏరియాల్లోనూ భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి. అలాగే తెలుగు వెర్షన్ రైట్స్ కూడ ఎక్కువ మొత్తానికే అమ్ముడయ్యాయి.

ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు ఏపి, తెలంగాణల్లో తెలుగు వెర్షన్ హక్కులు సుమారు రూ.30 కోట్లు పలికినట్టు తెలుస్తోంది. ఈ డీల్ మొత్తం అడ్వాన్స్ బేసిస్ మీదే జరగడం విశేషం. సినిమా ప్రమోషన్లకు స్వయంగా రజనీకాంత్ రంగంలోకి దిగడంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. మరి చాలా కాలంగా సరైన విజయం లేని రజనీ ఈ సినిమాతోనైనా సాలిడ్ హిట్ అందుకుంటారో లేదో చూడాలి.

  •  
  •  
  •  
  •