మంచి ధర పలికిన ‘వైఫ్ ఆఫ్ రామ్’ శాటిలైట్ హక్కులు !

మంచి ధర పలికిన ‘వైఫ్ ఆఫ్ రామ్’ శాటిలైట్ హక్కులు !

Published on Jun 18, 2018 11:20 AM IST

మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘వైఫ్ ఆఫ్ రామ్’. టీజర్ తో కొంత అటెంక్షన్ తెచ్చుకున్న ఈ సినిమా ట్రైలర్ తో పూర్తిగా ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేయగలిగింది. థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ ను రాజమౌళి సైతం అభినందించారు. దీంతో సినిమాపై క్యూరియాసిటీ మరింత పెరిగింది.

ఈ హైప్ మూలంగానే సినిమా యొక్క హిందీ శాటిలైట్ రైట్స్ రూ.1.5 కోట్లకు అమ్ముడయ్యాయి. విడుదలకు ముందే ఇంత పెద్ద మొత్తంలో బిజినెస్ జరగడం మంచి విషయమే. విజయ్ యలకంటి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ఆదర్శ్ బాలకృష్ణన్, శ్రీకాంత్ అయ్యర్, సామ్రాట్ రెడ్డిలు పలు కీలక పాత్రల్లో నటించారు. ఈ ప్రయోగాత్మక చిత్రం ద్వారా మరోసారి తన అభిరుచిని నిరూపించుకోవాలని మంచు లక్ష్మి భావిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు