రాజ్ తరుణ్ కు ఇది సదావకాశం !

13th, January 2018 - 09:17:02 AM

ఈ సంక్రాంతికి రెండు భారీ చిత్రాలు ‘అజ్ఞాతవాసి, జై సింహా’ లు పోటీకి దిగగా వీటితో పాటే రాజ్ తరుణ్ యొక్క ‘రంగుల రాట్నం’ కూడా బరిలో నిలిచింది. 10వ తేదీ విడుదలైన ‘అజ్ఞాతవాసి’ కి అభిమానులు, ప్రేక్షకుల నుండి నెగెటివ్ స్పందన రాగా నిన్న విడుదలైన ‘జై సింహ’ కు పర్వాలేదనే టాక్ ఏర్పడింది. ఇలా రెండు పెద్ద చిత్రాల్లో ఏదీ కూడా భారీ విజయాన్ని సాధించే సూచనలు లేకపోవడం రేపు ఆదివారం నాడు విడుదలకానున్న ‘రంగుల రాట్నం’ కు మంచి అవకాశాన్ని కల్పించింది.

ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాజ్ తరుణ్ చిత్రం గనుక బాగుందనే తెచ్చుకుంటే పండుగ సీజన్లో ఫ్యామిలీ ఆడియన్స్ యొక్క ఆదరణ దక్కి సినిమా విజయవంతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి రాజ్ తరుణ్ అండ్ టీమ్ ఈ పండక్కి ఫుల్ ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ థియేటర్లలో లేదు అనే లోటును తీర్చి ఘన విజయాన్ని దక్కించుకుంటుందో లేదో చూడాలి. శ్రీరంజని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించింది.