ఓవర్సీస్లో మంచి స్థాయిలో విడుదలవుతున్న ‘ఈ నగరానికి ఏమైంది’ !

ఓవర్సీస్లో మంచి స్థాయిలో విడుదలవుతున్న ‘ఈ నగరానికి ఏమైంది’ !

Published on Jun 26, 2018 2:08 PM IST

Ee Nagaraniki Emaindi

ఈ వారం విడుదలకానున్న సినిమాల్లో ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రంపై ప్రేక్షకుల్లో ఎక్కువ ఆసక్తి ఉంది. నిర్మాత సురేష్ బాబు నిర్మిస్తుండటంతో, ‘పెళ్లి చూపులు’ చిత్రంతో సంచనలం సృష్టించిన తరుణ్ భాస్కర్ దర్శకత్వం కావడంతో సినిమా బాగుంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో ఏర్పడింది.

టీజర్, ట్రైలర్, పాటలు బాగుంబడటంతో సినిమా జనాలకు ఇంకాస్త దగ్గరైంది. దీంతో సినిమాను మంచి స్థాయిలో విడుదలచేస్తున్నారు నిర్మాతలు. ముఖ్యంగా ‘పెళ్లి చూపులు’ సినిమాతో ఓవర్సీస్లో తరుణ్ భాస్కర్ కు మంచి క్రేజ్ ఏర్పడటంతో అక్కడ కూడ సినిమాను పెద్ద ఎత్తున విడుదలచేస్తున్నారు.

సుమారు 142 లొకేషన్లలో చిత్రం విడుదలకానుంది. దీంతో ఓపెనింగ్స్ పెద్ద మొత్తంలో ఉండనున్నాయి. ఇక చిత్రం బాగుండి మొదటి రోజు పాజిటివ్ టాక్ ఏర్పడితే తర్వాతి వసూళ్లు కూడ భారీగా ఉండే అవకాశాలున్నాయి. ఈ చిత్రంలో సుశాంత్ రెడ్డి, విశ్వక్ సేన్ నాయుడు, వెంకటేష్ కాకుమాను, అభినవ్ గోమటంలు ప్రధాన పాత్రలు పోషించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు