కార్తికేయ ‘చల్లని’ కబురు చెప్తాడా ?

కార్తికేయ ‘చల్లని’ కబురు చెప్తాడా ?

Published on Mar 17, 2021 10:03 PM IST

Chavu Kaburu Challaga
యంగ్ హీరో కార్తికేయ చేసిన కొత్త చిత్రం ‘చావు కబురు చల్లగా’. ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత కార్తికేయ నుండి వస్తున్న డిఫరెంట్ సినిమా ఇది. పాటలు, ట్రైలర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. భర్త చనిపోయి బాధల్లో ఉన్న అమ్మాయిని శవాలు మోసే కుర్రాడు ప్రేమిస్తే ఎలా ఉంటుంది అనేదే సినిమా కాన్సెప్ట్. వినేటప్పుడే మంచి థ్రిల్లింగా అనిపిస్తోన్న సినిమాపై ఆడియన్స్ మంచి హోప్స్ పెట్టుకున్నారు. ఎంటర్టైన్మెంట్ ఇస్తుందనే నమ్మకంతో ఉన్నారు.

దీంతో డిస్ట్రిబ్యూషన్ వర్గాల్లో సినిమా హక్కులకు మంచి డిమాండ్ ఏర్పడింది. హక్కులు మంచి ధరకు అమ్ముడయ్యాయి. ట్రేడ్ వర్గాల లెక్కల మేరకు నైజాం ఏరియాలో 4.25 కోట్లు, సీడెడ్ ప్రాంతంలో 2 కోట్లు, ఆంధ్రా రీజియన్లో 6 కోట్ల బిజినెస్ జరిగిందట. ఇక ఓవర్సీస్, రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకుంటే ఈ మొత్తం 13 కోట్ల వరకు తేలింది. అంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ 13 కోట్లకు పైమాటే. ఇది చిన్న టార్గెట్ ఏమీ కాదు. మొదటిరోజు మంచి టాక్ వస్తేనే మూడు నాలుగు రోజుల్లో ఈ మొత్తాన్ని వెనక్కు రాబట్టగలదు చిత్రం. చూడాలి మరి మార్చి 19న రానున్న కార్తికేయ ఏ స్థాయిలో ప్రేక్షకుల్ని మెప్పిస్తాడో.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు