‘శ్రీకారం’ బిజినెస్ బాగుందిగా

Published on Mar 8, 2021 8:34 pm IST


హీరో శర్వానంద్ చేస్తున్న కొత్త సినిమాల్లో ‘శ్రీకారం’ కూడా ఒకటి. డెబ్యూ దర్శకుడు కిశోర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను 14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంటలు నిర్మిస్తున్నారు. మార్చి 11న ఈ సినిమా రిలీజ్ కానుంది. పాటలు, టీజర్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమా మీద ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. దీంతో బిజినెస్ వర్గాల్లో చిత్రానికి మంచి డిమాండ్ ఏర్పడింది. అందుకే బిజినెస్ కూడ భాగానే జరిగింది.

నైజాం ఏరియాలో రూ. 5.7 కోట్లకు అమ్మడుకాగా సీడెడ్ ప్రాంతంలో రూ.2.4 కోట్లు, ఆంధ్రాలో రూ. 8 కోట్లు కలిసి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. ఇది భారీ మొత్తమే. ఈ మొత్తాన్ని వెనకు రాబట్టాలంటే సినిమా తప్పకుండా సాలిడ్ హిట్ అవ్వాల్సిందే. అప్పుడే మొదటి వారంలో బ్రేక్ ఈవెన్ సాధ్యమవుతుంది. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయకిగా నటించిన ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :