మంచి ధరకు అమ్ముడైన విక్రమ్ సినిమా హక్కులు !

మంచి ధరకు అమ్ముడైన విక్రమ్ సినిమా హక్కులు !

Published on Jun 8, 2018 2:34 PM IST


తెలుగు ప్రేక్షకుయ్లు ఎక్కువగా ఇష్టపడే తమిళ హీరోల్లో చియాన్ విక్రమ్ కూడ ఒకరు. ‘అపరిచితుడు’ చిత్రంతో తెలుగునాట మంచి క్రేజ్ సంపాదించుకున్న ఆయన ఇన్నేళ్లు దాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్నారు. ఆయన నటిస్తున్న తాజా సినిమా ‘సామి స్క్వేర్ ‘. విక్రమ్ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్న ఈ హెవీ యాక్షన్ ఎంటర్టైనర్ ను హరి డైరెక్ట్ చేస్తున్నారు.

అందుకే ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో కూడ మంచి బజ్ నెలకొంది. దీని మూలంగానే ఏపి, తెలంగాణ చిత్ర హక్కులు రూ. 8 కోట్లకు అమ్ముడయ్యాయి. బెల్లం రామకృష్ణారెడ్డి, గిరిలు ఈ హక్కుల్ని సొంతం చేసుకున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఏ చిత్రంలో ఇటీవలే ‘మహానటి’తో భారీ సక్సెస్ అందుకున్న కీర్తి సురేష్ కథానాయకిగా నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు