నితిన్ నటించిన కొత్త సినిమా చల్ మోహన్ రంగ. మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను కృష్ణ చైతన్య దర్శకత్వం వహించాడు. ఏప్రిల్ 5 విడుదలకు సిద్ధం అవుతున్న ఈ సినిమాలోని మాస్ సాంగ్ ”పెద్ద పులి” పాటకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. మొదట విడుదల చేసిన రెండు మోలోడి సాంగ్స్ కూడా ఆకట్టుకున్నాయి.
సినిమా విడుదల దగ్గర పడ్డంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు చిత్ర యూనిట్. ఈ నెల చివరి వారంలో భారి ప్రీ రిలీజ్ ఈవెంట్ చెయ్యాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. పవన్ కళ్యాణ్ ఈ ఫంక్షన్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నితిన్ చేస్తోన్న 25 వ సినిమా కావడంతో అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. విలేజ్ లవ్ స్టోరి గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


