చల్ మోహన్ రంగ సినిమా పాటలు పాపులర్ అవుతున్నాయి. తమన్ మరోసారి మంచి పాటలు ఇచ్చాడు. తొలిప్రేమ సినిమా తరువాత ఆ స్థాయిలో పాటలు ఉన్నాయని శ్రోతలు చెబుతున్నారు. నిన్న విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు మంచి స్పందన లబించింది. ఏప్రిల్ 5 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై పాజిటివ్ బజ్ ఉంది.
రౌడి ఫెలో సినిమా తరువాత కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తోన్న సినిమా ఇదే. ప్యుర్ లవ్ స్టోరి తో రూపొందిన ఈ సినిమా అన్ని వర్గాల వారిని అలరించే విధంగా ఉండబోతోందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది. ఈ సినిమాలో నితిన్ ఫారెన్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే అబ్బాయి పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ మూవీ తరువాత శ్రీనివాస్ కళ్యాణం సినిమాలో నటించబోతున్నాడు నితిన్. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాను సతీష్ వేగ్నేష్ దర్శకత్వం వహిస్తున్నాడు.


