మంచి రెస్పాన్స్ అందుకుంటున్న “ఎనిమీ” ఫస్ట్ సింగిల్!

మంచి రెస్పాన్స్ అందుకుంటున్న “ఎనిమీ” ఫస్ట్ సింగిల్!

Published on Aug 21, 2021 4:01 PM IST

యాక్షన్‌ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్‌ ఆర్యల క్రేజీ కాంబినేష‌న్‌లో తెరకెక్కుతున్న క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం “ఎనిమీ” ఇంటెన్స్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇది హీరో విశాల్‌ 30వ చిత్రం కాగా, ఆర్య 32వ మూవీ. ‘గద్దల కొండ గణేష్‌’ ఫేమ్‌ మృణాళిని రవి, మ‌మ‌తా మోహ‌న్‌దాస్‌ హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌ ఒక కీలక పాత్రలో నటించారు.

ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో మినీ స్టూడియోస్‌ పతాకంపై వినోద్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్ అన్ని భాష‌ల‌లో క‌లిపి 20 మిలియ‌న్ల‌కి పైగా వ్యూస్ సాధించి సినిమాపై అంఛ‌నాల‌ను భారీగా పెంచింది. కాగా ఈ రోజు ఎనిమి చిత్రం నుండి బ్లాక్‌బ‌స్ట‌ర్‌ మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ స్వ‌ర‌ప‌రిచిన `ప‌డదే..పడదే` ఫ‌స్ట్ సింగిల్ ను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌.

“అదిడే నిను చూసే క‌నులే నీ స్నేహం కోసం క‌దిలే..అదిగో నిను చూస్తేనే ఏదో కొంచెం సంతోషములే చినగా మాటాడే ప‌ర‌లే ఆ మాట‌లు ఏం స‌రిప‌డ‌వే..స‌రిగా క‌ళ్ల‌ల్లోకి నువ్వే చూస్తే మాటే ప‌గిలే..ప‌డ‌దే.. ప‌డ‌దే.. ప‌డ‌దే.. ఫ్రెండ‌యితే స‌రిప‌డ‌దే.. ప‌డ‌దే.. ప‌డ‌దే.. ప‌డ‌దే.. నా మన‌సుకిదేం ప‌డ‌దే….”`అంటూ సాగే ఈ పాట‌కు అనంత్ శ్రీ‌రామ్ సాహిత్యం అందించగా పృథ్విచంద్ర ఫుల్ ఎన‌ర్జీతో ఆల‌పించారు. త‌మ‌న్ క్యాచీ ట్యూన్ మ‌రోసారి మ్యూజిక్ లవర్స్ ని అలరిస్తుంది. విశాల్, మృణాలిని ర‌వి మ‌ధ్య‌ కెమిస్ట్రీ ఈ పాట‌కి హైలెట్ గా నిలిచింది. ఈ పాట‌కు సోష‌ల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. సెప్టెంబ‌రులో తెలుగు, తమిళం, హిందీ స‌హా మరికొన్ని భాషలలో ఈ చిత్రం విడుదలకానుంది.

ఇక ఈ చిత్రంలో యాక్షన్‌ హీరో విశాల్, ఆర్య, మృణాళిని రవి సహా మ‌మ‌తా మోహ‌న్ దాస్, ప్రకాశ్‌రాజ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇక ఈ చిత్రం సాంకేతిక నిపుణులు విషయానికి వస్తే దర్శకత్వం: ఆనంద్‌ శంకర్‌, నిర్మాత: వినోద్‌ కుమార్‌, సంగీతం: తమన్‌ ఎస్‌ ఎస్‌, సినిమాటోగ్రఫీ: డి రాజశేఖర్, ఆర్ట్‌: టి. రామలింగం, ఎడిటర్‌: రేమండ్‌, డెరిక్‌ క్రాస్టా, యాక్షన్‌: రవివర్మ లు అందిస్తున్నారు.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు