‘ఫస్ట్ ర్యాంక్ రాజు’ ట్రైలర్ కి విశేష స్పందన

Published on Jun 17, 2019 10:00 pm IST

చేతన్ మద్దినేని, కాశిక్ వోహ్రా హీరో హీరోయిన్స్ గా నరేశ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ “ఫస్ట్ ర్యాంక్ రాజు”. రెండు రోజుల క్రితం విడుదలైన ఈ మూవీ టీజర్ టీజర్ కి విశేష స్పందన వస్తుంది.ఇప్పటీకే ఫస్ట్ ర్యాంక్ రాజు ట్రైలర్ యూట్యూబ్ లో వన్ మిలియన్ వ్యూస్ కి చేరుకుంది. తండ్రి పెంపకం వలన సిలబస్ తప్ప కామన్ సెన్స్ తెలియకుండా పెరిగిన రాజు, సొసైటీ లో పడే ఇబ్బందులు,తన వలన ఇతరులకు ఎదురైయే సమస్యలు కామిక్ గా చూపించారు. ప్రస్తుత విద్య వ్యవస్థపై ఓ సెటైరికల్ మూవీ గా “ఫస్ట్ ర్యాంక్ రాజు” కథ ఉన్నట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది

ట్రైలర్లో హీరో చేతన్ రెండు డిఫరెంట్ షేడ్స్ లో చక్కగా చేశాడు. కాశిక్ వోహ్రా గ్లామర్ ట్రైలర్ కి మరో ఆకర్షణ అని చెప్పాలి. బ్రహ్మానందం,ప్రియదర్శి,వెన్నెల కిషోర్, పోసాని కామెడీ బాగుంది. సినిమా టీజర్ కి వస్తున్న స్పందనతో చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కచ్చితంగా సినిమా విజయం సాదిస్తుందని నమ్ముతున్నారు.

నరేష్,ప్రకాష్ రాజ్,బ్రహ్మానందం,ప్రియదర్శి,వెన్నెల కిశోర్,పోసాని ముఖ్యపాత్రలలో నటిస్తున్న ఈ మూవీ డాల్ఫిన్ ఎంటరైన్మెంట్స్ బ్యానర్ పై వి.కందుకూరు నిర్మిస్తుండగా,కిరణ్ రవీంద్రనాథ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

X
More