“గుణ 369” ఓ ఫుల్ మీల్స్ లాంటి సినిమా అవుతుంది-నిర్మాతలు

Published on Jun 17, 2019 6:04 pm IST

‘ఆర్ ఎస్ 100’ ఫేమ్ కార్తికేయ హీరోగా,అనఘా హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న మూవీ “గుణ 369”. లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో అనిల్ కడియాల,తిరుమల రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఈ మూవీ టీజర్ ని చిత్ర యూనిట్ విడుదల చేశారు. సంధర్బంగా చిత్ర యూనిట్ పేస్ మీట్ లో పాల్గొన్నారు. నిర్మాతలలో ఒకరైన శ్రీమతి ప్రవీణ కడియాల మాట్లాడుతూ ఈ మూవీ తరువాత కార్తికేయను, గుణం 369 కార్తికేయ అనిపిలుస్తారని అన్నారు.

టీజ‌ర్‌కు వ‌స్తున్న స్పంద‌న గురించి ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ “టీజ‌ర్ విడుద‌లైన కొన్ని కొద్దిసేపటికే నా మొబైల్ కాల్స్ తో బిజీ ఐపోయింది. టీజర్ లోని ప్రతి అంశాన్ని ప్రస్తావిస్తూ చాలా బాగుంది అనిచెవుతున్నారు. టీజర్ కి వెయ్యి రెట్లు బాగా సినిమా ఉంటుంది అన్నారు.

నిర్మాత‌లు అనిల్‌ కడియాల, తిరుమ‌ల్ రెడ్డి మాట్లాడుతూ,మా టీజ‌ర్ కు అద్భుత‌మైన స్పందన‌ వ‌స్తోంది. యువ‌త‌కు కావాల్సిన అంశాలు, ఫ్యామిలీ కోరుకునే విష‌యాలు, మాస్ ప్రేక్ష‌కుల‌ను న‌చ్చే స‌న్నివేశాల స‌మాహారంగా టీజ‌ర్ ఉంద‌ని, ఫుల్ మీల్స్ లాంటి సినిమా అవుతుంద‌ని అన్నారు. దాదాపు షూటింగ్ పూర్తయింది,మిగిలిన చిత్రీకరణ కూడా త్వరలో పూర్తి చేస్తాం అన్నారు.ఈ నెలాఖ‌రున పాట‌ల‌ను విడుద‌లచేయనున్నాం అని తెలిపారు. ఈ చిత్రానికిసంగీతం చైతన్య భరద్వాజ్‌, కెమెరామెన్‌గా ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ రామ్, ఆర్ట్‌ డైరెక్టర్‌గా జీయమ్‌ శేఖర్, ఎడిటర్గా తమ్మిరాజు పనిచేస్తున్నారు.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :

X
More