‘వైభవం’ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్.. థియేటర్స్ లో రిలీజ్ కి సిద్ధం

vaibhavam 1

యువ హీరో హీరోయిన్స్ రుత్విక్, ఇక్రా ఇద్రిసి హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతూ ఈ నెల 23న రిలీజ్ కానున్న ‘వైభవం’. అయితే ఈ చిత్రం తాలూకా ట్రైలర్ ను ఇటీవలే విడుదల చేశారు. ట్రైలర్ కి మంచి స్పందన లభిస్తున్నందుకు దర్శకుడు సాత్విక్ హర్షాన్ని వ్యక్తం చేశారు. ‘ఆపదలో ఉన్నపుడు సహాయం చేసేవాళ్లు తక్కువ మంది ఉంటారురా! ఎవరైనా ఆపదలో ఉన్నారనిపిస్తే వాళ్లు నోరు తెరిచి అడిగేలోపు నువ్వే వాళ్లకి సహాయం చెయ్యి’ అని ఒక తల్లి తన కొడుకుతో చెప్పడం ఈ ట్రైలర్ లో మంచి ఎమోషనల్ గా అనిపిస్తుంది.

మరి నూతన నిర్మాణ సంస్థ రమాదేవి ప్రొడక్షన్స్ ద్వారా రూపొందిన సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు నుండి క్లీన్ యూ సర్టిఫికెట్ అందుకున్న “వైభవం” చిత్రం ఈ వేసవిలో చక్కటి వినోదాన్ని ప్రేక్షకులకి పంచనుందని దర్శకుడు తెలిపారు. ఇక ఈ చిత్రానికి సంగీతం, ఎడిటింగ్ కూడా సాత్విక్ వహించడం విశేషం.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version