‘మళ్ళీ రావా’ చిత్రం తో మంచి విజయాన్నిసాధించిన సీనియర్ హీరో సుమంత్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఇదం జగత్’. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం యొక్క టీజర్ ఇటీవల వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా విడుదలయింది. ఇక ఈచిత్రం ఇప్పటివరకు 20లక్షల వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఈ సంధర్బంగా సుమంత్ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.
నూతన దర్శకుడు అనిల్ శ్రీకంఠం తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో అంజు కురియన్ కథానాయికగా నటిస్తున్నారు. జొన్నలగడ్డ పద్మావతీ, శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రానికి గూఢచారి’ ఫెమ్ శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు.


