‘లవ్ స్టోరీ’ సూపర్బ్ బిజినెస్ చేసిందట

Published on Mar 16, 2021 6:00 pm IST

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘లవ్ స్టోరీ’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ‘ఫిదా’ తర్వాత శేఖర్ కమ్ముల చేస్తున్న సినిమా కావడం అందునా సాయి పల్లవి కథానాయిక కావడంతో సినిమాపై మొదటి నుండి పాజిటివ్ బజ్ ఉంది. ఇప్పటికే సినిమా నుండి మూడు పాటలు విడుదలయ్యాయి. వాటిలో ‘సారంగ దరియా’ సాంగ్ విశేషమైన ఆదరణ పొందింది. 50 మిలియన్ల వ్యూస్ క్రాస్ చేసి టాలీవుడ్లో తక్కువ సమయంలో 50 మిలియన్ మార్క్ అందుకున్న పాటగా రికార్డ్ నెలకొల్పింది.

ఈ ఒక్క పాటతో సినిమా లెవల్ అమాంతం పెరిగింది. ప్రేక్షకుల్లోనే కాదు ట్రేడ్ వర్గాల్లో కూడ సినిమా హక్కులకు మంచి డిమాండ్ ఏర్పడింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి సినిమా 30 కోట్ల రూపతయల థియేట్రికల్ బిజినెస్ చేసినట్టు తెలుస్తోంది. శేఖర్ కమ్ముల సినిమాలకు ఓవర్సీస్లో ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. కాబట్టి అక్కడ కూడ మంచి రేటుకే సినిమాను విక్రయించి ఉంటారు నిర్మాతలు. ఇక శాటిలైట్, డిజిటల్ హక్కులు ఎలాగూ ఉండనే ఉన్నాయి. అన్నీ కలుపుకుంటే 45 కోట్ల వరకు ఉండొచ్చు. ఏప్రిల్ 16న ఈ చిత్రం విడుదలకానుంది. కలల్ని నిజం చేసుకోవడం కోసం హైదరాబాద్ వచ్చిన యువతీయువకుల కథగా ఈ చిత్రం ఉండనుంది. నారాయణ్ దాస్ కె నారంగ్, రామ్మోహన్ రావ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :