‘గూఢచారి’ అక్కడ అదరగొడుతున్నాడు !

‘గూఢచారి’ అక్కడ అదరగొడుతున్నాడు !

Published on Aug 12, 2018 10:55 PM IST


శశి కిరణ్ టిక్క దర్శకత్వంలో అడివి శేష్ నటించిన చిత్రం’ గూఢచారి’. ఆగస్టు 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి కలెక్షన్స్ తో ఘనవిజయం దిశగా దూసుకుపోతుంది. స్పై త్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను బాగానే అలరిస్తుంది. ఇక ఈ చిత్రం ఫై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు సినీ ప్రముఖులు తెలుగులో ఇలాంటి చిత్రం ఇప్పటివరకు రాలేదని ఇలాంటి అద్భుతమైన సినిమాను అందించినందుకు చిత్ర టీంను అభినందిస్తున్నారు.

ఇక ఈ చిత్రం ఇండియాలోనే కాకుండా అటు ఓవర్సీస్ లో కూడా మంచి వసూళ్లను సాధిస్తుంది. ఇప్పటివరకు అక్కడ ఈ చిత్రం1. 5 మిలియన్ల డాలర్ మార్కును క్రాస్ చేసింది. అభిషేక్ పిక్చర్స్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో శోభిత దూళిపాళ్ల కథానాయికగా నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు