విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, తెలుగు జాతి ఆరాధ్య దైవం స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈనాటికి తెలుగు ప్రజల గుండెల్లో ఆయన స్థానం పదిలం.
తన ప్రస్థానంలో ఎన్ని గౌరవాలు, సత్కారాలు అందుకున్నారు ఎన్టీఆర్. తాజాగా ప్రముఖ ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఎన్టీఆర్ ను ఘనంగా గౌరవించింది. ఎన్టీఆర్ పేరు మీద ఒక ప్రత్యేక ఫాంట్ ను తమ డేటాబేస్ లో చేర్చింది. సిలికాన్ ఆంధ్ర డెవలప్ చేసిన ఈ ఫాంట్ లను ప్రతి ఒక్కరూ ఉపయోగించవచ్చు. ఫాంట్ ల కొరకు ఈ లింక్ క్లిక్ చేయండి. http://www.google.com/fonts/earlyaccess
గత కొన్ని సంవత్సరాలుగా డేటాబేస్ లో మరిన్ని తెలుగు ఫాంట్లు జోడించడానికి గూగుల్ ప్లాన్ చేస్తుంది. వీటిని నెటిజన్లు ఫ్రీగా ఉపయోగించవచ్చు.


