
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – విక్టరీ వెంకటేష్ కలిసి నటించిన క్రేజీ ప్రాజెక్ట్ ‘గోపాల గోపాల’. ఈ సినిమాని ముందుగా జనవరి 9న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ టెక్నికల్ గా ఆలస్యం అవడం వల్ల సినిమాని కాస్త వెన్నకి వేసారు. 10 లేదా 11 తేదీల్లో రిలీజ్ చేస్తారని పలువురు అంటున్నా టీం నుంచి మాత్రం కచ్చితమైన ఖరారు కాలేదు. అంతే కాకుండా ఇంకా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి కాలేదు. కాసేపు ఈ విషయాన్ని పక్కన పెడితే అన్ని చోట్లా ఈ సినిమా రిలీజ్ కి మాత్రం జోరుగా సన్నాహాలు జరిగిపోతున్నాయి.
మాకు అందిన తాజా సమాచారం ప్రకారం ‘గోపాల గోపాల’ సినిమాని ఓవర్సీస్ లో 100కి పైగా లోకేషన్స్ లో రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. ఇప్పటి వరకూ 100కి పైగా ఉన్న లొకేషన్స్ రిలీజ్ రోజుకి మరింత పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ 10న సినిమా రిలీజ్ అనుకుంటే 9న ప్రీమియర్స్ వెయ్యడానికి కూడా అక్కడ ఉన్న బ్లూ స్కై సినిమాస్ వారు సిద్దంగా ఉన్నారు. దీనంతటికీ కారణం పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్.. ఈ రోజు సాయంత్రం లోపల సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యే అవకాశం ఉంది.
అభిమానులంతా ఎంతో ఆసక్తిగా భారీ అంచనాలతో ఎదురు చూస్తున్న ఈ సినిమాకి కిషోర్ పార్ధసాని డైరెక్టర్. సురేష్ బాబు – శరత్ మరార్ కలిసి నిర్మించిన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించాడు.