
గురువారం సాయంత్రం సెన్సార్ పూర్తి చేసుకున్న ‘గోపాల గోపాల’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. యు.ఎస్.ఏ.లో ప్రేక్షకులను ఒక్క రోజు ముందే గోపాలుడు, తన దర్శన భాగ్యం కల్పిస్తున్నాడు. జనవరి 9వ తేదీన అమెరికాలో ప్రీమియర్ షోలు వేయడానికి డిస్ట్రిబ్యూటర్లు సన్నాహాలు చేశారు. ప్రీమియర్ షో టికెట్ ధరను 20 డాలర్లుగా నిర్ణయించారు. జనవరి 10 నుండి రెగ్యులర్ షోలకు 16 డాలర్లు వసూలు చేయనున్నారు. ఓవర్సీస్ లో 100 థియేటర్లలో సినిమాను విడుదల చేస్తున్నారు.
విక్టరీ వెంకటేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి నటించిన ఈ సినిమాకు డాలీ దర్శకుడు. వెంకీ సరసన సాధారణ గృహిణిగా శ్రియ నటించింది. సురేష్ బాబు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. హిందీలో ఘన విజయం సాధించిన ‘ఓ మై గాడ్’ సినిమాకు రీమేక్ ఇది.