విక్టరీ వెంకటేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలసి నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా ‘గోపాల గోపాల’. ఈ సినిమా తాజా షెడ్యూల్ బుధవారం నుండి హైదరాబాద్ లో జరుగుతుంది. ఇప్పటికే వెంకటేష్ పాల్గొనగా సినిమాలో కీలక సన్నివేశాలను దాదాపుగా చిత్రీకరించారు. అయితే పవన్, వెంకి కాంబినేషన్లో ముఖ్య సన్నివేశాలను ఈ షెడ్యూల్లో షూటింగ్ చేయనున్నారని సమాచారం. పవన్ కళ్యాణ్ ఒక షెడ్యూల్ షూటింగ్ లో మాత్రమే పాల్గొన్నారు.
పవన్ కళ్యాణ్ మోడరన్ శ్రీకృష్ణుడిగా కనిపిస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ సరసన శ్రియ శరన్ నటిస్తుంది. మిథున్ చక్రవర్తి, మధుశాలిని, దీక్షా పంత్ ఇతర పాత్రలలో నటిస్తున్నారు. కిషోర్ పార్దాసాని(డాలీ) ఈ సినిమాకు దర్శకుడు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. సురేష్ బాబు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2015 సంక్రాంతి కానుకగా ‘గోపాల గోపాల’ విడుదల చేయనున్నారు.


