పవర్ ప్యాక్డ్ డైలాగులతో దద్దరిల్లుతున్న గోపాల గోపాల స్క్రీన్స్

పవర్ ప్యాక్డ్ డైలాగులతో దద్దరిల్లుతున్న గోపాల గోపాల స్క్రీన్స్

Published on Jan 10, 2015 10:00 PM IST

Gopala-Gopala-(3)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోడ్రన్ కృష్ణుడి పాత్రలో అలరించిన ‘గోపాల గోపాల’ చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి రెస్పాన్స్ ని అందుకుంటుంది. వెంకటేష్, పవన్ కలిసి నటించిన మల్టీ స్టారర్ సంక్రాంతి కానుకగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తుంది.

ఈ సినిమాలో ముఖ్యంగా పవన్ నోటి నుండి వస్తున్న డైలాగ్స్ కి విశేష స్పందన వస్తోంది, ‘కృష్ణం వందే జగద్గురుమ్’ సినిమాతో ఆకట్టుకున్న సాయి మాధవ్ బుర్రా ఈ సినిమాకి డైలాగ్ రైటర్ గా పనిచేశాడు. ఈ సినిమాలోని పవన్ పలికిన కొన్ని అదిరిపోయే డైలాగ్స్ మీకోసం…

* వేగం బండి ఇంజిన్ మీద వుండదు మిత్రమా నడిపేవాడి నరాల్లో వుంటుంది.
* ఒకోసారి రావడం లేట్ అవ్వచ్చు.. కానీ రావడం మాత్రం పక్కా..
* దారి చూపించడం వరకే నా పని…గమ్యాన్ని చేరుకోవడం మీ పని
* నేను టైం కి రావడం కాదు తమ్ముడు..నేను వచ్చాకే టైం వస్తుంది
* బరువు చూసే వాడికి కాదు మిత్రమా…మోసే వాడికి తెలుస్తుంది
* సమర్థులు ఇంట్లో ఉండి పోతే…అసమర్థులు రాజ్యమేలుతారు

ఇదే కాకుండా ఈ సినిమాలో ఇంకో స్పెషాలిటీ వుంది. అదేంటో తెలియాలి అంటే సినిమా చివరివరకూ వేచి చూడాల్సిందే.

తాజా వార్తలు