పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – విక్టరీ వెంకటేష్ కలిసి నటించిన క్రేజీ ప్రాజెక్ట్ ‘గోపాల గోపాల’. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని జనవరి 10న గ్రాండ్ రిలీజ్ కి సిద్దమైంది. ఈ మల్టీ స్టారర్ మూవీ తో పవన్ కళ్యాణ్ – వెంకటేష్ కలిసి రికార్డ్స్ క్రియేట్ చెయ్యడానికి సిద్దమయ్యారు. ఇప్పటికీ ఓపెన్ అయిన టికెట్స్ కి చాల అక్రేజ్ ఉంది. బుకింగ్ లో మొదటి మూడు రోజులకి టికెట్స్ దాదాపు ఫుల్ అయిపోయాయి. చెప్పాలంటే ఒకరోజు ముందు ఖరారు చేసిన సినిమాకి రికార్డ్ స్థాయి ఓపెనింగ్స్ వస్తున్నాయి.
ట్రేడ్ పండితులు చెబుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మొదటి రోజు సెన్సేషనల్ రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని అంటున్నారు. సంక్రాంతి పండుగ సీజన్ కావడం వలన ఈ సినిమా కలెక్షన్స్ కి తిరుగులేదని అంటున్నారు. ఈ మల్టీ స్టారర్ సినిమాలపై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలను అందుకోవడమే కాకుండా చూసే ఆడియన్స్ ని థ్రిల్ చేసేలా ఈ సినిమా ఉంటుందని ఈ చిత్ర టీం అంటోంది. వెంకటేష్ సరసన శ్రియ శరన్ నటించిన ఈ మూవీకి కిషోర్ పార్ధసాని డైరెక్టర్.


