పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – విక్టరీ వెంకటేష్ అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన ‘గోపాల గోపాల’ సినిమా జనవరి 10న రిలీజ్ అయ్యి అభిమానులకి మూడు రోజుల ముందే సంక్రాంతిని తీసుకు రావడమే కాకుండా బాక్స్ ఆఫీసు వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఫ్యాన్స్ షో నుంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమాకి సంక్రాంతి సీజన్ తోడవడంతో కలెక్షన్స్ వర్షం కురుస్తోంది. కేవలం తెలుగు నాటే కాకుండా ఓవర్సీస్ లో కూడా మంచి కలెక్షన్స్ ని రాబట్టుకుంది. ఆ రేంజ్ కలెక్షన్స్ రాబట్టుకున్న గోపాల గోపాల మొదటి వారంలో రికార్డ్ స్థాయి కలెక్షన్స్ ని సాధించింది.
మాకు అందిన తాజా సమాచారం ప్రకారం మొదట్టి ఆరు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సుమారు 29.5 కోట్ల షేర్ ని సాధించింది. ఈ లెక్క ప్రకారం మొదటి వారంలో 30 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేస్తుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మొదటి వారంలో 30 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన సినిమాగా ‘గోపాల గోపాల’ రికార్డ్ సృష్టించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – విక్టరీ వెంకటేష్ కలిసి నటించడమే ఈ సినిమాకి పెద్ద పల్స్అయితే , వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సీన్స్ అంతకన్నా పెద్ద ప్లస్ అవ్వడంతో ఆడియన్స్ సినిమా చూడటానికి మరింత ఆసక్తి చూపుతున్నారు.


