ఆల్ క్లియర్ – 4న గోపాలుడి గీతాలు వచ్చేస్తున్నాయి.!

gopala-gopala-audio

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – విక్టరీ వెంకటేష్ కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ ‘గోపాల గోపాల’. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాని సంక్రాంతి కానుకగా ప్రేక్షకులకు అందివ్వడానికి ఈ చిత్ర టీం సన్నాహాలు చేస్తోంది. అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమా ఆడియో రిలీజ్ గురించి కొద్ది రోజులుగా సందిగ్దం నెలకొంది. జనవరి 1న రిలీజ్ ఉంటుంది అనుకుంటే అది కాస్త కాన్సల్ అయ్యింది. తాజాగా ఈ చిత్ర టీం జనవరి 4న ఈ సినిమా ఆడియోని రిలీజ్ చేయనున్నట్లు తెలియజేశారు. ఈ వేడుక హైదరబాద్లోని శిల్పకళా వేదికలో జరిగే అవకాశం ఉంది.

అలాగే అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్న ‘గోపాల గోపాల’ మ్యూజిక్ ఆల్బంలో కేవలం మూడు పాటలు మాత్రమే ఉంటాయి. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ రోజే పవన్ కళ్యాణ్ కూడా డబ్బింగ్ చెప్పడం మోదాలు పెట్టాడు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘ఓ మై గాడ్’ కి రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాకి కిషోర్ పార్ధసాని డైరెక్టర్. సురేష్ బాబు – శరత్ మరార్ కలిసి నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ – వెంకటేష్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

Exit mobile version