
టాలీవుడ్ అంతా ఎంతగానో ఎదురు చూస్తున్న మల్టీ స్టారర్ మూవీ ‘గోపాల గోపాల’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కావడంతో ఆకాశాన్ని తాకే రేంజ్ లో అంచనాలున్నాయి. షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకులకు అందివ్వడానికి ఈ చిత్ర టీం సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా ఈ చిత్ర టీం రేపు ఈ సినిమాని సెన్సార్ కి పంపడానికి సిద్దమవుతోంది. జనవరి 4న ఈ సినిమా ఆడియోని రిలీజ్ చేసారు.
అలాగే అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్న ‘గోపాల గోపాల’ మ్యూజిక్ ఆల్బంలో కేవలం మూడు పాటలు మాత్రమే ఉంటాయి. పవన్ కళ్యాణ్ కూడా తన డబ్బింగ్ పార్ట్ ని పూర్తి చేసాడు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘ఓ మై గాడ్’ కి రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాకి కిషోర్ పార్ధసాని డైరెక్టర్. సురేష్ బాబు – శరత్ మరార్ కలిసి నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ – వెంకటేష్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం ఈ చిత్ర టీం సినిమాని జనవరి 9 లేదా 10న రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటోంది.