రేపే గోపీచంద్ – యువి క్రియేషన్ మూవీ ఫస్ట్ లుక్

రేపే గోపీచంద్ – యువి క్రియేషన్ మూవీ ఫస్ట్ లుక్

Published on Jun 11, 2014 12:52 PM IST

gopichandh-new-movie
టాలీవుడ్ మాచో హీరో గోపీచంద్ వరుసగా తన సినిమాలను సెట్స్ పైకి తీసుకొచ్చాడు. అందులో ఒకటి శ్రీ వాస్ దర్శకత్వంలో చేస్తుంటే మరో సినిమా ‘సాహసం’ మూవీ రైటర్ ని డైరెక్టర్ గా పరిచయం చేస్తున్న సినిమా. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ని యువి క్రియేషన్స్ బ్యానర్ పై ప్రమోద్ ఉప్పలపాటి – వంశీకృష్ణా రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాని ఇటీవలే ప్రభాస్ చేతుల మీదుగా లాంచనంగా ప్రారంభించారు.

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా మొదలై కొద్ది రోజులే అయినప్పటికీ ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు టీజర్ ని రేపు గోపీచంద్ పుట్టిన రోజు సందర్భంగా లాంచ్ చేయడానికి ఈ చిత్ర టీం సన్నాహాలు చేస్తోంది. ఇంత తక్కువ టైంలో సినిమా ఫస్ట్ లుక్, టీజర్ ని రిలీజ్ చేయడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఇంకా హీరోయిన్ ఖరారు కాని ఈ సినిమాకి మణిశర్మ తనయుడు సాగర్ మహతి సంగీతం అందిస్తున్నాడు.

తాజా వార్తలు