గోపిచంద్ 26 రీమేకా ?

Published on Feb 3, 2019 10:12 am IST

పంతం తరువాత హీరో గోపీచంద్ తిరు దర్శకత్వంలో తన 26వ చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం యొక్క మొదటి షెడ్యూల్ రాజాస్థాన్ లోని జై సల్మేర్ లో జరుగుతుంది. అయితే ఈ చిత్రం సల్మాన్ ఖాన్ నటించిన ‘ఏక్ థా టైగర్’ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలు నిజమో కాదో తెలియాలంటే చిత్రా యూనిట్ దీనిపై క్లారిటీ ఇచ్చే దాకా ఎదురుచూడాల్సిందే. ఇక ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారని సమాచారం. అందులో భాగంగా బాలీవుడ్ నటి జరీన్ ఖాన్ ను ఒక హీరోయిన్ గా తీసుకుంటారని ప్రచారం జరుగుతుంది.

ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఫై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి పడి పడి లేచె మనసు ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :