‘స్పై థ్రిల్ల‌ర్’ తోనైనా హిట్ అందుకుంటాడా ?

‘స్పై థ్రిల్ల‌ర్’ తోనైనా హిట్ అందుకుంటాడా ?

Published on Aug 28, 2019 2:02 AM IST

తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా వస్తోన్న యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్ చాణ‌క్య‌. అయితే ఇప్పటికే ఈ సినిమా టాకీ పార్ట్ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. కాగా ఇటివలే ప్రారంభమైన డబ్బింగ్ కార్యక్రమాలు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం గోపీచంద్ తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నారు. ఇక ఈ సినిమాను సెప్టెంబర్‌ లో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. అలాగే మిగిలిన సాంగ్స్ ను మూవీ మేకర్స్ విదేశాల్లో చిత్రీకరించాలనుకుంటున్నారు. కాగా ఈ చిత్రంలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ హైలెట్ గా నిలుస్తాయట. ముఖ్యంగా ఇండో – పాక్ బోర్డర్ లో వచ్చే సన్నివేశాలు.. అలాగే సెకెండ్ హాఫ్ లోని కీలక సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో గోపీచంద్ సరసన మెహరీన్ హీరోయిన్‌ గా నటిస్తుంది. వీరిద్దరూ జంటగా నటిస్తోన్న రెండో చిత్రమిది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి వెట్రి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ గడ్డంతో ఉన్న మ్యాచో లుక్‌ లో కనిపించనున్నారు. కాగా గోపీచంద్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న ఈ స్పై థ్రిల్లర్ ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. మరి గత కొన్ని సినిమాలుగా వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తూ వస్తోన్న గోపీచంద్, ఈ సారి ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని బాగా పట్టుదలగా ఉన్నాడు. మరి హిట్ అందుకుంటాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు