హైద‌రాబాద్‌ లో ‘చాణ‌క్య‌’ షూటింగ్ !

హైద‌రాబాద్‌ లో ‘చాణ‌క్య‌’ షూటింగ్ !

Published on Jul 3, 2019 1:20 PM IST

తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా న‌టిస్తోన్న యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్ `చాణ‌క్య‌`. రీసెంట్‌గా గోపీచంద్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్టర్‌ను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ పోస్ట‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు గోపీచంద్ గడ్డంతో ఉన్న మ్యాచో లుక్‌ ను విడుద‌ల చేశారు. గోపీచంద్‌తో మెహ‌రీన్ జ‌త‌గా న‌టిస్తోన్న ఈ చిత్రం ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌ లో శరవేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది.

ఇక ఈ నెలాఖ‌రుకి టాకీ పార్ట్ పూర్త‌వుతుంది. మూడు పాట‌లు మాత్ర‌మే మిగిలి ఉన్నాయి. విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి వెట్రి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ హైలెట్ గా నిలుస్తాయట. ముఖ్యంగా ఇండో – పాక్ బోర్డర్ లో వచ్చే సన్నివేశాలు.. అలాగే సెకెండ్ హాఫ్ లోని కీలక సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు